హైదరాబాద్, వెలుగు: టీచర్ల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉందని టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ కంటెంట్ అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లోని టీ-శాట్ ఆఫీసులో ‘పీఎం ఈ-–విద్య’ ఆధ్వర్యంలో టీచర్లకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ పాఠాలను అందించడంతోపాటు వాటిని విద్యార్థులు చూసేలా ప్రోత్సహించాలన్నారు. తెలంగాణకు కేటాయించిన 5 పీఎం ఈ-విద్య చానళ్లను వినియోగించుకోవాలని చెప్పారు. పీఎం ఈ- విద్య ఢిల్లీ ఇన్‌చార్జ్ అభయ్‌కుమార్, గుజరాత్ సాట్‌కామ్ డైరెక్టర్ రాజేష్ పటేల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 200 పీఎం ఈ-విద్య చానళ్లలో తెలంగాణకు 5 కేటాయించినట్టు తెలిపారు.
